మునగాల మండల పరిధిలో ఎన్నికల నామినేషన్ కు పటిష్ట బందోబస్తు

మునగాల మండల పరిధిలో  ఎన్నికల నామినేషన్ కు పటిష్ట బందోబస్తు

మునగాల, వెలుగు: మునగాల మండల పరిధి రేపాల గ్రామంలో నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం  పరిశీలించారు. ఎన్నికలకు ఐదంచెల పోలీసు భద్రత ఉండాలని ఆఫీసర్లను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి ఆంక్షలు అమలు చేయాలన్నారు.  

అనుమతిఉన్న వ్యక్తులను మాత్రమే లోపలికి పంపించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పౌరులు గుంపుల చేరకుండా నిషేధం విధించాలన్నారు. ప్రజలు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలన్నారు. ఎస్పీ వెంట కోదాడ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్ సిబ్బంది ఉన్నారు.