ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో.. ముమ్మర తనిఖీలు

పద్మారావునగర్​,వెలుగు: ఢిల్లీలోని ఎర్రకోటలో ఇటీవల జరిగిన పేలుడు సంఘటన దృష్ట్యా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సికింద్రాబాద్  రైల్వేస్టేషన్ లో గురువారం ఆర్పీఎఫ్, జీఆర్పీ బీడీడీఎస్ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. 

ప్రయాణికుల లగేజీ, ఇతరత్రా వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. డాగ్ స్క్వాడ్​ తో రైల్వేస్టేషన్లోని పార్కింగ్ ప్రాంతాలు, వెయిటింగ్ హాల్స్, సర్క్యలేటింగ్ ప్రాంతాలు, రైళ్లు, పార్శిల్ కార్యాలయంతో పాటు కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. 

యాంటీ- సాబాటేజ్ డ్రిల్స్ నిర్వహించారు. ముందస్తు  భద్రతా చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. ఆర్పీఎస్ ఇన్​స్పెక్టర్ బీఎస్ సారస్వత్, ఎస్ఐ వెంకట్ రెడ్డి, జీఆర్పీ ఇన్​స్పెక్టర్ సాయిఈశ్వర్ గౌడ్, ఎస్సై రమేశ్​ తదితరులు 
పాల్గొన్నారు.