సుప్రీం సీజేఐగా మహిళను నియమించే టైమ్ వచ్చింది

సుప్రీం సీజేఐగా మహిళను నియమించే టైమ్ వచ్చింది

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మహిళను నియమించాల్సిన సమయం ఆసన్నమైందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. మహిళలను జడ్జిలుగా నియమించడంపై కోలీజియం  ఆసక్తిగా ఉందని స్పష్టం చేసింది. హైకోర్టుల్లో మహిళా లాయర్లను అపాయింట్ చేయాలంటూ నమోదైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. హయ్యర్ జ్యుడీషియరీలోనే కాకుండా సుప్రీంకి సీజేఐగా మహిళల్ని నియమించాల్సిన సమయం వచ్చిందని చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌‌లు సంజయ్ కిషన్ కౌల్, సూర్యకాంత్‌‌ల ప్రత్యేక బెంచ్ వివరించింది. సుప్రీంలో సీజేల వ్యవస్థ మొదలైన 1950వ సంవత్సరం జనవరి 26 నుంచి ఇప్పటివరకు మొత్తం 48 మంది చీఫ్ జస్టిస్‌లుగా వ్యవహరించారు. వీరిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం.