
లోక్సభ ఎన్నికలు చివరి దశకు వచ్చిన వేళ ‘టైమ్ మేగజైన్’ ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోతో ఓ ఆర్టికల్ ప్రచురించింది. ఇండియాలో జరుగుతున్న ఎన్నికలపై ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఎడిషన్ విడుదల చేసింది…. ఈ సంచికకు కవర్ ఫొటోగా మోడీ కారికేచర్ వేసింది. అయితే, ఈ ఆర్టికల్ హెడ్డింగ్ మాత్రం ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ అని పెట్టడం వివాదాస్పదంగా మారింది.
ఆతీష్ తసీర్ రాసిన ఈ ఆర్టికల్‌లో ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు పేర్కొంది. మూక దాడులు, యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్నియామకం, భోపాల్ టికెట్ సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు కేటాయించడం తదితర సంఘటనలను ఇందులో చర్చించారు. గుజరాత్ అల్లర్లను కూడా ఈ ఆర్టికల్‌లో గుర్తుచేశారు.
2012 లో ‘అండర్ ఎచీవర్’ అంటూ మన్మోహన్ పై టైమ్ వ్యాసం
మాజీ పీఎం మన్మోహన్ సింగ్ ను ‘ది అండర్ ఎచీవర్’ అంటూ తన కవర్ పేజీని 2012 లో రూపొందించింది టైమ్ మేగజైన్. దేశంలో జరుగుతున్న స్క్యామ్ లను మన్మోహన్ నిరోధించలేకపోయారని తెలిపింది. దేశానికి శాడో పీఎంగా మాత్రమే మన్మోహన్ వ్వవహరించారని విమర్శించింది టైమ్ మ్యాగజైన్.