మాస్క్‌ ఇలా వాడాలి

మాస్క్‌ ఇలా వాడాలి

రోజులో ఎక్కువసేపు మాస్క్‌‌ పెట్టుకొని ఉండటం వల్ల ఫేస్‌‌పైన చెమట పట్టి ఇన్ఫెక్షన్స్‌‌, రాషెస్‌‌, దురద లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్‌‌ వస్తున్నాయి. మాస్క్‌‌తో స్కిన్‌‌ ప్రాబ్లమ్స్‌‌ రాకుండా ఉండేందుకు కొన్ని టిప్స్‌‌ పాటించాలి. ఎన్‌‌95, సర్జికల్ మాస్క్‌‌లు నాలుగు గంటలకంటే ఎక్కువసేపు పెట్టుకునేవాళ్లకు స్కిన్ ఇన్ఫెక్షన్స్‌‌ వచ్చే అవకాశం ఉంది. క్లాత్‌‌ మాస్క్‌‌ వాడితే ఫేస్‌‌పైన తక్కువ ఇన్ఫెక్ట్‌‌ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే అవి కరోనా వైరస్‌‌ను అంత ఎఫెక్టివ్‌‌గా అడ్డుకోవు. 

స్కిన్‌‌ ఇన్ఫెక్షన్స్‌‌ రాకుండా ఉండేందుకు చర్మాన్ని ఎప్పటికప్పుడు క్లీన్‌‌గా వాష్‌‌ చేసుకుని మాయిశ్చరైజ్‌‌ని అప్లై చేయాలి. ముఖం కడగడానికి మంచి ఫేస్‌‌వాష్‌‌ను వాడటం బెటర్‌‌‌‌. కెమికల్స్‌‌ తక్కువగా ఉండే స్కిన్‌‌ ప్రొడక్ట్స్‌‌ వాడటం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్‌‌, ఎలర్జీలు రాకుండా ఉంటాయి. డ్రై, సెన్సిటివ్‌‌ స్కిన్ ఉండేవాళ్లు మాయిశ్చరైజర్‌‌‌‌ను మాస్క్‌‌ వాడేముందు, వాడిన తరువాత అప్లై చేసుకోవాలి. కొందరికి మాస్క్‌‌ పెట్టుకోవడం వల్ల పెదాలు పగిలి,  స్కిన్‌‌ డ్రైగా మారుతుంది. వీటిని పోగొట్టేందుకు రోజూ ముఖం కడుకున్న తరువాత, పడుకునే ముందు పెదాలకు మాయిశ్చరైజర్‌‌‌‌ రాసుకోవాలి. రోజూ ఒకేలాంటి మాస్క్‌‌ కాకుండా టైట్​ చేసుకునేవి, ఇయర్‌‌‌‌ లూప్స్‌‌తో ఉన్నవి పెట్టుకుంటే చెవి వెనక నొప్పి రాకుండా ఉంటుంది.

ముఖంపై పింపుల్స్ ఉండి మేకప్ ప్రొడక్ట్స్‌‌ వాడుతుంటే, వాటిని వెంటనే ఆపేయాలి. లేదంటే మాస్క్‌‌ పెట్టుకోవడం వల్ల పట్టే చెమట స్కిన్‌‌ను మరింత డ్యామేజ్ చేస్తుంది. డెర్మటాలజిస్ట్‌‌  సజెషన్‌‌ తీసుకుని కొన్ని రోజులు ఏ క్రీమ్ వాడక పోవడం మంచిది. సింథటిక్‌‌ ఫైబర్‌‌‌‌వి కాకుండా, సాఫ్ట్‌‌గా కంఫర్టబుల్‌‌గా ఉండే మాస్క్‌‌లు పెట్టుకోవాలి. మాస్క్‌‌ను కిందికి, పైకి జరపడం వల్ల ముఖంపైన ఉండే పింపుల్స్‌‌ను రుద్దినట్టు అవుతుంది. దాంతో ఇన్ఫెక్షన్‌‌ పెరుగుతుంది. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి సేఫ్‌‌ ప్లేస్‌‌లో మాస్క్‌‌ను ఒక పావుగంట పాటు తీసేసి రిలాక్స్‌‌ అవ్వాలి.