హాయిగా ఇలా నిద్రపోవాలి

హాయిగా ఇలా నిద్రపోవాలి

నిద్రలేమి.. ఈ మధ్య కాలంలో చాలామందిలో కనిపిస్తున్న సమస్య. మామూలుగా 6 నుండి 7 గంటల నిద్ర అవసరం. కానీ హెల్త్‌‌ ప్రాబ్లమ్‌‌ వల్లో, స్ట్రెస్‌‌ వల్లో ఇంకా ఏదైనా కారణంతోనో నిద్ర టైం తగ్గిపోయింది చాలామందికి. దీనివల్ల చేసే వర్క్‌‌ మీద ప్రభావం పడుతోంది. ఇలా జరగకుండా మంచి నిద్ర కోసం ఈ టిప్స్‌‌ ఫాలో అయితే సరి.

సైకిల్‌‌ ప్రిపరేషన్‌‌: నిద్ర పోవడానికంటూ కొంత టైం కేటాయించుకోవాలి. పడుకునేముందు ఒక సారి లైట్ ఆఫ్‌‌ చేస్తే మళ్లీ నిద్రలేచాకే ఆన్‌‌ చేయాలి. రాత్రి కొంచెం తొందరగా నిద్రపోయేలా చూసుకుంటే, ఉదయం తొందరగా నిద్రలేవొచ్చు. దీంతో వర్క్‌‌లో లేజీనెస్‌‌ ఉండదు.

ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయాలి: నిద్రలేమికి స్ట్రెస్‌‌, యాంగ్జైటీ, తిండి అలవాట్లు కూడా కారణం కావచ్చు. వాటిని పోగొట్టడానికి ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ బాగా ఉపయోగపడుతుంది. రోజుకి 40 నిమిషాల ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ వల్ల వీటిని దూరం చేయొచ్చు.

నైట్‌‌ ఫుడ్‌‌ తగ్గించాలి: చాలామంది నైట్‌‌ టైంలో రకరకాల హెవీ ఫుడ్‌‌ తింటుంటారు. వాటిలో పిండిపదార్థాలు, స్వీట్‌‌ ఐటమ్స్‌‌, ఆల్కహాల్‌‌, కెఫిన్‌‌కు దూరంగా ఉండాలి.  వీటిబదులు కార్బోహైడ్రేట్స్‌‌ ఎక్కువగా ఉండే పాలు తాగాలి.  బ్రౌన్‌‌ రైస్‌‌లో ఎక్కువగా ట్రిప్టోఫాన్‌‌ ఉంటుంది. అది మంచి నిద్రకు హెల్ప్‌‌ చేస్తుంది. 

లైట్‌‌ డిన్నర్‌‌: నిద్రపోతున్న టైంలో తిన్న అన్నం అరగడానికి చాలా టైం పడుతుంది.  దాంతో అజీర్తి, గ్యాస్ట్రిక్‌‌ సమస్య వస్తాయి.  అందుకే నిద్రపోవడానికి మూడు నాలుగు గంటల ముందే డిన్నర్‌‌‌‌ ముగించాలి. లేదా లైట్‌‌ ఫుడ్‌‌ తినాలి.

డిస్టర్బెన్స్‌‌ ఉండొద్దు: కొంతమంది ఎంత నిద్రలో ఉన్నా సరే చిన్న అలికిడికి కూడా లేచి కూర్చుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే మొబైల్‌‌ ఫోన్‌‌ లాంటివి సైలెంట్‌‌ చేసుకోవాల్సిందే. అలాగే బెడ్రూమ్‌‌లో లైట్‌‌ ఫోకస్‌‌ తక్కువ ఉండాలి.