
యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి, వీడియోలు పోస్ట్ చేయగానే డబ్బు రాదు. ముందుగా అకౌంట్ సెట్టింగ్‌లో మానిటైజేషన్ ఆఫ్షన్ ఎనేబుల్ చేయాలి. అన్ని ఛానెళ్లకి సబ్స్ర్కయిబర్స్ లక్షల్లో ఉండరు. మనీ రావాలంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో చేరాలి. అప్పుడే యాడ్స్ రూపంలో మనీ వస్తుంది. మంచి కంటెంట్ ఉన్నా సరే కొన్నిసార్లు వ్యూస్ రావు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే... ముందుగా ఛానెల్‌ని సబ్‌స్ర్కయిబ్ చేసుకోవాల్సిందిగా తెలిసిన వాళ్లందరికీ రిక్వెస్ట్ పెట్టాలి. వీడియోని చూసి షేర్ చేసేది వాళ్లే. అప్పుడే సబ్స్ర్కయిబర్స్ సంఖ్య పెరుగుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయ్యే కంటెంట్ తీసుకోవాలి. ఆన్లైన్ కమ్యూనిటీల్లో వీడియోల్ని షేర్ చేస్తూ ఉండాలి. అట్రాక్ట్ చేసే థంబ్‌నెయిల్స్ వాడాలి. ఛానెల్‌ని ప్రమోట్ చేయడం కోసం ఛానెల్ ట్రైలర్ లేదా టీజర్ వీడియో క్రియేట్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఛానల్ పాపులర్ అవుతుంది.