పిల్లలు తినట్లేదా.. అయితే ఇలా చేయండి

పిల్లలు తినట్లేదా.. అయితే ఇలా చేయండి

ఏడాది వయసు నుంచే పిల్లలకి బ్యాలెన్స్​డ్​​​ డైట్​ అలవాటు చేయాలి. ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు వాళ్ల డెవలప్​మెంట్​కి చాలా ముఖ్యం. కానీ, పిల్లల్లో కొంతమంది ‘పికీ ఈటర్స్​’ ఉంటారు. వీళ్లు కొత్తరకం ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు.  ఏదైనా కూడా కొంచెమే తింటారు.  ఇలాంటి పిల్లలకి పోషకాహారం తినిపించడం ఛాలెంజ్​​. పిల్లల చేత హెల్దీఫుడ్​ తినిపించేందుకు కౌన్సెలింగ్​ సైకాలజిస్ట్​ ప్రాచీ కోహ్లి చెబుతున్న టిప్స్​ కొన్ని.

మనదేశంలోని దాదాపు 80శాతం మంది తల్లులు తమ పిల్లలు ‘పికీ ఈటర్స్’ అని చెబుతున్నారని స్టడీలు అంటున్నాయి. అయితే పిల్లలపై ‘పికీ ఈటర్స్’ అని ముద్ర వేస్తే, పెద్దయ్యాక కూడా అలాగే ఉంటారు. అందుకే వాళ్లని ముద్దు చేస్తూ, కబుర్లు చెబుతూ తినిపించాలి. బ్యాలెన్స్​డ్​ ఫుడ్ తినడం అలవాటు చేయాలి. పిల్లలకి ఆకలిగా ఉన్నప్పుడే తినిపించాలి. అలాకాకుండా టైం కాని టైంలో తినిపించాలని చూస్తే వాళ్లకి ఫుడ్ మీద ఇష్టం పోతుంది. పిల్లల ఫుడ్​ ఛాయిస్​లని అర్థం చేసుకోవాలి. అంతేకాదు వాళ్లకి కొంచెం కొంచెం తినిపించాలి. ప్లేట్​ ఖాళీ అయిన తర్వాత ‘ఇంకొంచెం తింటావా?’ అని అడగాలి.  ఫుడ్ తినిపించేటప్పుడు జ్యూస్​లు, శ్నాక్స్ వంటివి ఇవ్వకూడదు. ఇలాంటివి ఇస్తే వాళ్ల ఆకలి తగ్గిపోతుంది. దాంతో రోజూ తినాల్సిన దాని కంటే తక్కువ తింటారు.