పిల్లల్లారా... పరీక్షల వేళ ఈ టిప్స్​ పాటించండి.. ఇక విజయం మీదే..

పిల్లల్లారా... పరీక్షల వేళ ఈ టిప్స్​ పాటించండి.. ఇక విజయం మీదే..

పిల్లలకు పరీక్షల సమయం వచ్చేసింది.  బోర్డు ఎగ్జామ్స్​ అంటే సహజంగా ఒత్తిడి ఎదుర్కొంటారు.  చాలా మంది వారి ప్రణాళికలను సిద్ధం చేసుకొని చదువుకుంటారు కానీ కొందరికి ఒత్తిడి కారణంగా సిద్ధపడే విధానం అర్థం కాదు.. అయితే విద్యార్థులు వారి పరీక్ష సమయంలో ఎలా మెలగాలో వివరణను పరిశీలించండి..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (CBSE) పరీక్షల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అనుసరించాల్సినవి, కొన్ని చేయకూడని పనుల జాబితాను వెల్లడించింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. పరీక్షా సమయం అనేది చాలా సాధారణమైన పరిస్థితిగా సూచిస్తోంది. కష్టతరమైన పరీక్షల కోసం విద్యార్థులు సిద్ధమవుతున్న సమయంలో కొన్ని వ్యూహాలను అనుసరించడం వల్ల పరీక్షలో మంచి ఫలితాలను సాధించడానికి తల్లిదండ్రులు సాయపడవచ్చునని పేర్కొంది. అదేవిధంగా, ఆందోళన, ఒత్తిడిని అధిగమించడంలో విద్యార్థులకు సాయపడే వ్యూహాలు, అవసరమైన విధానాన్ని సీబీఎస్ఈ బోర్డు షేర్ చేసింది.

విద్యార్థులు చేయాల్సిన పనులివే 

  • మీ ఏకాగ్రత పరిధిని తెలుసుకోండి. మధ్యలో కొద్ది సమయం విరామం ఇస్తూ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి.
  • విద్యార్థులు ఏకాగ్రత కోసం మంచి సమయాన్ని ఎంచుకోవాలి.
  • కష్టతరమైన సబ్జెక్టుల కోసం ఇతర విద్యార్థులతో గ్రూప్ స్టడీ తప్పనిసరిగా ఉండాలి.
  • విద్యార్థులు ప్రతికూల ఫలితాలతో నిరుత్సాహపడకూడదు.
  • గత పరీక్షల్లో తప్పిదాలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నించాలి.
  • విద్యార్థులు తప్పనిసరిగా అన్ని సబ్జెక్టులకు టైమ్‌ మేనేజ్‌మెంట్ ప్లాన్ రూపొందించుకోవాలి.
  • పరీక్షల సమయంలో అనేక అంశాలను నేర్చుకుంటారు.అయితే, వాటిని మరిచిపోకుండా ఉండేందుకు మళ్లీ రివిజన్ చేయాలి.
  • పరీక్ష సమయలో తొందరగా గుర్తించడానికి సులభంగా ఉంటుంది.
  • రివిజన్ చేయనివి వెంటనే మరచిపోయే అవకాశం ఉంటుంది.
  • విద్యార్థులు తప్పనిసరిగా టైమ్‌టేబుల్‌ను రూపొందించుకోవాలి... రివిజన్ టైమ్ ప్లాన్ చేసుకోవాలి.
  • మీ టైమ్‌టేబుల్‌లో రిలీఫ్ కోసం గేమ్స్, వాకింగ్, టీవీ చూడటం వంటివి కూడా ఉండాలి.
  • కీలకమైన సబ్జెక్ట్‌లకు ఎక్కువ  ప్రాధాన్యత - విద్యార్థులు పరీక్షలలో మెరుగ్గా రాణించడానికి కీలకమైన సబ్జెక్ట్‌లకు అగ్ర ప్రాధాన్యతనివ్వాలి. కఠినమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం, సులభమైన సబ్జెక్టులకు తక్కువ సమయం కేటాయించుకోవాలి. డౌట్స్ అన్నింటిని ముందుగానే క్లియర్ చేసుకోవాలి. 
  • స్వీయ-మూల్యాంకనం: పరీక్షల కంటే ముందు మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మీకు మీరే పరీక్ష పెట్టుకోండి.
  • మాక్ పరీక్షలు తరచుగా విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే అవి వారి స్వంత బలాలు, లోపాలను గుర్తించడంలో సహాయపడతాయి.
  • శారీరక- మానసిక ఆరోగ్యం కోసం క్రీడలు: ఒత్తిడిని అధిగమించడానికి కాసేపు చదువును పక్కనబెట్టి క్రీడలు ఆడాలి లేదా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించడానికి, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, సంగీతం, ధ్యానం చేయడం వంటివి ప్రాక్టీస్ చేయండి.
  • భయాన్ని వీడాలి: అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, తక్కువ గ్రేడ్‌లు అందుకుంటామనే భయం ఉండకూడదు. ఫలితాలపై ఆలోచించకుండా చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలి


విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు చేయాల్సినవి.. చేయకూడనివి ఇవే 

  • విద్యార్థులు బాగా చదివినప్పుడు మెచ్చుకంటే సరిపోదు.. మీరు బాగా చదివారు.. ఇంకా బాగా చేయగలరంటూ పాజిటివ్ విషయాలను చెప్పి ప్రోత్సహించాలి.
  • పిల్లల విశ్వాసాన్ని పెంచడానికి వారి సమస్యలను అడిగి చర్చించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి.
  • పిల్లలు తక్కువ మార్కులు లేదా గ్రేడ్‌ల కారణంగా నిరుత్సాహపడితే వారిలో విశ్వాసాన్ని పెంచేలా తల్లిదండ్రులు తప్పనిసరిగా వారిలో విశ్వాసాన్ని పెంచాలి.
  • తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రణాళిక, మేనేజ్‌మెంట్ టైమ్-టేబుల్ సెట్ చేసుకోవడంలో మార్గనిర్దేశం చేయాలి.
  • విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమైతే బాగా రాణించలేరు.
  • పిల్లల ఒత్తిడి పరిస్థితిని నివారించడానికి, తల్లిదండ్రులు సరైన ప్రేరణ కలిగించాలి. అందుకోసం సానుకూల వాతావరణాన్ని కల్పించాలి.
  • విద్యార్థులు ఒత్తిడిని తగ్గించేలా ఫన్నీగా మాట్లాడాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రెండ్లీగా మెలగాలి
  • పరిష్కారం కనుగొనడంలో విద్యార్థులకు అవసరమైన సహాయం చేయాలి.