
తలనొప్పి, మైగ్రేన్, మొటిమలు తగ్గడానికి కుడి, ఎడమ చేతుల నాలుగు వేళ్లని నుదిటి మధ్యలో ఉంచాలి. నుదిటిని నెమ్మదిగా నొక్కుతూ వేళ్లని చెవులవరకు తీసుకురావాలి. తరువాత కళ్ల మీద వేళ్లతో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్‌గా సున్నితంగా మసాజ్ చేయాలి.
బుగ్గల నిండా గాలి పీల్చుకోవాలి. రెండు వేళ్లని పెదాలకు అడ్డుగా పెట్టి, 30 సెకండ్లు ఉండాలి. కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ ఒకసారి చేయాలి. ఇలా చేయడంవల్ల ముఖంలో డల్‌నెస్ తగ్గుతుంది. మొటిమలు పోతాయి. ముఖంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడి, తక్కువ వయసు వారిలా కనిపించడానికి చేతివేళ్లతో నుదుటిమీద నుంచి మెడ వరకు నెమ్మదిగా తట్టాలి.