తిరుచానూరు ప్రధాన పూజారి కరోనాతో మృతి

V6 Velugu Posted on Apr 30, 2021

  • ఇప్పటి వరకు టీటీడీలో 15 మంది ఉద్యోగులు మృతి

తిరుపతి: పవిత్ర తిరుమల క్షేత్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ప్రధాన పూజారి ఎంజీ రామచంద్రన్‌ కరోనా మహమ్మారికి బలయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుచానూరు కూడా భాగమే.  ఇప్పటి వరకు టీటీడీలో 15 మంది ఉద్యోగులు మరణించగా రామచంద్రన్‌ మృతితో ఈ సంఖ్య 16కి చేరుకుంది. ప్రధాన పూజారి మృతిపై టీటీడీ ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని, వారికి అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
 

Tagged , tirupati corona, tirumala corona, tiiruchanur temple high priest, tirupati priest m g ramachandran, priest died

Latest Videos

Subscribe Now

More News