తిరుమలలో ఫుల్ రష్.. దర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో ఫుల్ రష్.. దర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవులు ఉండటంతో.. కలియుగ ప్రత్యక్షదైవమైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం కాగా.. రూ. 300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెప్పారు. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. 

ఈరోజు(మార్చి 25) టీటీడీ ఆధ్వర్యంలో రెండు విశేష ఉత్సవాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నిన్నటి(మార్చి 24) నుంచి తుంబుర తీర్థ ముక్కోటి కొనసాగుతుంది. 

నిన్న(ఆదివారం) 80,532 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,438 తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.