గోవిందా.. గోవిందా... కాళ్లకు గోనెసంచులు కట్టుకున్న భక్తులు.. ఎందుకంటే

గోవిందా.. గోవిందా... కాళ్లకు గోనెసంచులు కట్టుకున్న భక్తులు.. ఎందుకంటే

తిరుమలలో  కొందరు భక్తులు కాళ్లకు గోనె సంచులు కట్టుకుని కనిపించారు. కొండపై ఎండ తీవ్రత విపరీతంగా  పెరుగడమే దీనికి కారణం. ఆలయ పరిసర ప్రాంతాల్లోని కాలిబాటలో కొన్నిచోట్ల కూల్ పెయింట్ వేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేడి నుంచి పాదాలను కాపాడుకునేందుకు లడ్డూ ప్రసాద వితరణకు వినియోగించే గోనె సంచులను  పాదాలకు ధరించి భక్తులు నడుస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఓ పక్క ఎండలు మండి పోతున్నాయి. మరో పక్క తిరుమల కొండ కిటకిటలాడి పోతుంది.  ఎర్రటి ఎండలో భక్తులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అసలే కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వరస్వామి నడిచిన ప్రాంతం.. ఆ ప్రాంతం ఎంతో ప్రసిద్దమైంది. తిరుమల కొండపై భక్తులు దాదాపు చెప్పుల్లేకుండానే తిరుగుతుంటారు.  ఇక స్వామి దర్శనానికి వెళ్లే సమయంలో చెప్పే పనే లేదు.  ఈ క్రమంలో తిరుమలలో భక్తులు  కాళ్లకు గోనె సంచులు కట్టుకొని విచిత్రంగా కనిపించారు. కొండపై ఎండ దెబ్బకు మాడ వీధుల్లో నడవలేకపోతున్నామని భక్తులు అంటున్నారు. అందుకే తాము గోనె సంచుల్ని ఇలా కట్టుకుని నడవాల్సి వస్తుందంటున్నారు. మాడ వీధుల్లో కొన్ని చోట్ల కూల్ పెయింట్ వేయలేదని.. వెంటనే అక్కడ కూడా కూల్ పెయింట్ వేస్తే బావుంటుందని టీటీడీని కోరుతున్నారు.

 తిరుమల కొండపై విపరీతంగా ఎండ తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం సమయంలో ఎండను చూస్తే నిప్పుల కొలిమిలా అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆలయ పరిసర ప్రాంతాల్లోని కాలిబాట కూల్ పెయింట్ కొన్ని చోట్ల వేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భక్తులు ఆ వేడి నుంచి పాదాలను కాపాడుకునేందుకు ఇలా కాళ్లకు లడ్డూ ప్రసాద వితరణకు వినియోగించే జూట్ బ్యాగులను పాదాలకు ధరించి భక్తులు నడుస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ కూల్ పెయింట్ వేసి వేసవి ఉపశమన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో జనాలు అల్లాడిపోతున్నారు. వాతావరణంలో మార్పుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, దీనికితోడు ఈ ఏడాది ఎల్‌నినో తీవ్రత కొనసాగుతున్నందున ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. 

నిప్పుల కొలిమిలా మారిన కొండపై నడిచేందుకు భక్తులు గోనె సంచులను ఉపయోగిస్తున్నారు. లడ్డూ ప్రసాదాన్ని అందించే జూట్ బ్యాగులను కాళ్లకు కట్టుకుని నడుస్తూ వెళుతున్నారు. ఇలా పాదరక్షలు ధరించి తిరుమల పవిత్రతను దెబ్బతీయకుండా వుండటంతో పాటు ఎండవేడినుండి కూడా రక్షణ పొందుతున్నారు. జూట్ బ్యాగులను పాదరక్షలుగా చేసుకుని వెళుతున్న భక్తుల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రతి సంవత్సరం  తిరుమల కొండపై కూల్ పెయింట్ వేస్తారని... ఈసారి మాత్రం అలా చేయలేదని అన్నారు. అందువల్లే భక్తులు కాళ్లు కాలకుండా గోనెసంచులను ఆశ్రయించాల్సి వచ్చిందని అంటున్నారు. కూల్ పెయింట్ వేయకుండా శ్రీవారి భక్తులను ముప్పుతిప్పలు ఎందుకు పెడుతున్నారు? అంటూ టీటీడీని  భక్తులు ప్రశ్నిస్తున్నారు. 

నెటిజన్లు సైతం టిటిడి భక్తులతో వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతున్నారు. భక్తుల శ్రీవారికి సమర్పించే డబ్బులు కావాలి...కానీ వారికి సౌకర్యాలు కల్పించడం చేతకాదా? అంటూ నిలదీస్తున్నారు. దేశంలోనే రిచ్చెస్ట్ ఆలయంలో ఈ పరిస్థితి వుంటే ఇక మిగతా ఆలయాల్లో పరిస్థితి ఏమిటని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా శ్రీవారి భక్తుల జూట్ బ్యాగ్ వ్యవహారం సంచలనంగా మారింది.