తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ ప్రమాదం

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మళ్ళీ ప్రమాదం జరిగింది. ఒకటవ మలుపు వద్ద భక్తులతో వెళ్తున్న తుఫాన్ వాహనం బండరాయిని ఢీ కొట్టింది. వాహనంలోని భక్తులు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో డ్రైవర్ వాహనాన్ని వదిలి బయటకు దూకెందుకు ప్రయత్నించాడు.

అందులో ఉన్న భక్తులు వాహనం స్టీరింగ్ తిప్పి తమని తాము కాపాడుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వాహనం ఏపీలోని కడపకు చెందినదిగా గుర్తించారు. బ్రేక్ ఫైల్ అవడంతో ప్రమాదం జరిగింది అంటున్నారు భక్తులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.