తిరుమల కొండ కిటకిట.. శిలాతోరణం వరకు క్యూలైన్.. స్వామి దర్శనానికి 24 గంటలు

తిరుమల కొండ కిటకిట.. శిలాతోరణం వరకు క్యూలైన్.. స్వామి దర్శనానికి 24 గంటలు

తిరుమల కొండకు భక్తుల రద్దీకొనసాగుతుంది. దసరా సెలవులు.. మగిసి.. బళ్లు.. ఆఫీసులు మొదలైన తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తారు భక్తులు.  పెరటాసి మాసం కావడంతో తిరుమల  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి, బయట శిలా తోరణం వరకూ క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. 

స్వామివారి ఉచిత సర్వ దర్శనానికి  24 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 7 గంటలకు సమయం... రూ.  300 ల  ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. ఇక  నిన్న  ( అక్టోబర్​ 7) మంగళవారం తిరుమల శ్రీవారిని 71 వేల 634 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో  24 వేల 980 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.. 4.74  కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు...