తిరుమలలో జోరువాన.. రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన చెట్లు

తిరుమలలో జోరువాన.. రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన చెట్లు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో మే 26 రాత్రి జోరు వాన పడింది. భారీ వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది.  తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో చెట్లు విరిగిపడ్డాయి. 

మంగళవారం ( మే 26) ఉదయం నుంచి జనాలు ఎండలకు అల్లాడిపోయారు.  మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయింది.  రాత్రి సమంలో జోరు వాన పడింది. అర గంట పాటు ఆగకుండా వర్షం పడింది. నిన్నటి వరకు భగభగలాడిన సూర్యుడితో.. ఉక్కబోతతో అల్లాడిన తిరుమల క్షేత్రం చల్లగా మారిపోయింది.

మంగళవారం ( మే 26)  రాత్రి తిరుమల తిరుపతిలో భారీగా  వర్షం కురిసింది. పెనుగాలులతో  చెట్లె నేలకొరిగాయి.  ఇటీవల జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఘాట్ రోడ్లలో కొండ చెరియలు, మట్టిపెళ్ళలు, బండరాళ్ళు విరిగిపడే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు....
రోడ్లపై పడిన చెట్లని తొలగించాలని భక్తులు విఙ్ఞప్తి చేస్తున్నారు.  తిరుపతి నుండి తిరుమలకు వెళ్లకే ఘాట్ రోడ్డులో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు.