
తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రంగానే.. ప్రకృతి అందాలను తలపిస్తోంది. తిరుమలలో పేరుకుపోయిన మంచు కాశ్మీర్ దృశ్యాలను భక్తులకు కనువిందు చేస్తున్నాయి. మూడు రోజులుగా ( ఆగస్టు 7 నాటికి) కురస్తున్న భారీ వర్షాలకు తిరుమల శేషాచల కొండలపై దట్టమైన పొగమంచు పేరుకుపోయింది. దీంతో ఘాట్ రోడ్ పై వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళుతున్నారు.
తిరుమలలో కాశ్మీర్ అందాలు.. మంచు తెరలతో శ్రీవారి భక్తులు సెల్ఫీలు pic.twitter.com/dvuTduOFrJ
— Manohar Reddy (@ManoharRed18542) August 7, 2025
శ్రీవారి ఆలయం చుట్టూ అలుముకున్న పొగమంచు భక్తులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తులు సెల్ఫీలు..ఫొటోలు తీసుకుంటూ కూల్ వెదర్‌ను ఎంజాయి చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎండ... ఉక్కపోతకు జనాలను అల్లాడుతుంటే.. తిరుమలకు వచ్చిన భక్తులు మంచు తెరల వాతావరణంలో సేద తీరుతున్నారు.