
తిరుమల కొండకు భక్తుల తాకిడి కొద్దిగా తగ్గింది. నిన్నటి వరకు అన్ని కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండాయి. కాని ఈ రోజు ( ఆగస్టు 24) కేవలం ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు ఉన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు ( ఆగస్టు 24) స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. ప్రతి వీకెండ్ సమయంలో భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల.. ఈ వీకెండ్ లో ( ఆగస్టు 24) భక్తుల రద్దీ ఏమాత్రం కనిపించడం లేదు.
సాధారణంగా ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇవ్వాళ ( ఆగస్టు 24) రద్దీ లేకపోవడంతో భక్తులు త్వరగానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. గత 5 నెలల కాలంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి హుండీ ఆదాయం సైతం బాగా పెరిగింది
శ్రీవారి లడ్డూ విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. క్యూ లైన్ లు బయట వరకూ విస్తరించడం, కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోవడంతో నిన్నటి ( ఆగస్టు 23) వరకూ తిరుమల భక్త జన సంద్రంతో కిటకిట లాడింది. కానీ
తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఉచిత సర్వ దర్శనం భక్తులకు సుమారు 8 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 3 గంటల సమయం, రూ. 300/- ప్రత్యేక దర్శనం భక్తులకు సుమారు 2 గంటల సమయం పడుతుంది.
శనివారం ( ఆగస్టు 23) తిరుమల శ్రీవారిని 83 వేల 858 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26 వేల 034 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.