తిరుమల హుండీ దొంగను పట్టుకున్నారు...

తిరుమల హుండీ దొంగను పట్టుకున్నారు...

కలియుగ దేవుడు.. శ్రీనివాసుడు.. వెంకటేశ్వరస్వామి.. భక్తుల కోర్కెలు తీరుస్తాడని ప్రపంచ వ్యాప్తంగా  భక్తులు ఏడుకొండలవాడికి కానుకలు సమర్పిస్తుంటారు.  అందరి కోర్కెలు తీర్చే ఆ స్వామి హుండీని  ఓ వ్యక్తి దొంగిలించాడు..  వైకుంఠనాథుడి క్షేత్రంలో పోలీసు బందోబస్తు.. సీసీ కెమెరాల నిఘా కట్టుదిట్టంగా ఉంటుంది.  ఇదంతా .. ఆ తస్కరునికి  తెలుసో .. తెలయదో కాని.. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో బంగారు బావి పక్కన టీటీడీ అధికారులు ఏర్పాటు చేసిన స్టీల్​ హుండీని దొంగిలించిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.

తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తిరుమల హుండీలోని 4 వేల రూపాయిలను దొంగిలించాడు.  ఈ ఘటనను గమనించిన  సీసీటీవీ పర్యవేక్షణలో కమాండ్ & కంట్రోల్ అధికారులు గుర్తించారు.  వెంటనే ఆ దొంగ కదలికను కూడా సీసీటీవీ ద్వారా తెలుసుకున్న అధికారులు.. వెంటనే విజిలెన్స్ & సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తిరుమల వన్​ టౌన్​ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారని సీఐ విజయ్​ కుమార్​ తెలిపారు.