శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల ఎప్పుడంటే..?

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల ఎప్పుడంటే..?

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. డిసెంబర్‌ మాసానికి చెందిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను సెప్టెంబర్ 25వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.

వాస్తవానికి సెప్టెంబర్ 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను విడుదల చేయాల్సి ఉండగా.. సోమవారానికి వాయిదా వేసింది. తిరుమలలో వసతి గదుల కోటాను 27న విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.