
తిరుమల, వెలుగు: తిరుమల శ్రీనివాసుడికి మొక్కుల రూపంలో భక్తులు హుండీల్లో సమర్పించే చిల్లర నాణేల మార్పిడిపై టీటీడీ దృష్టి పెట్టింది. గడిచిన రెండు నెలల్లో రూ.26 కోట్ల కాయిన్స్ ను మార్పిడి చేసింది. మరో రూ.5 కోట్లు మార్పిడికి చర్యలు వేగవంతం చేసింది. కొంతకాలంగా చిల్లర నాణేలు పరికామణిలో పేరుకున్నాయి. టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చొరవ తీసుకుని మార్పిడిపై చర్యలు చేపట్టారు. బ్యాంకర్లు హుండీల్లో ఎంత చిల్లర సేకరిస్తే అంతే మొత్తంలో నగదు డిపాజిట్ చేసేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల ఎప్పటికప్పుడు చిల్లర నాణేలను బ్యాంకర్లు డిపాజిట్ రూపంలో మార్పిడి చేసుకుంటున్నారు.