తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో పెరిగిన  భక్తుల రద్దీ..  సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 2023 జూన్ 09 శుక్రవారం  రోజున క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిటకిటలాడతున్నాయి.  కొద్దిరోజులుగా తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోతున్నాయి.  సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.  

ఇక 2023 జూన్  08 గురువారం రోజున తిరుమల  శ్రీవారిని 70 వేల160 మంది భక్తులు దర్శించుకునిమొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 38 వేల 076 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

కాగా.. తిరుమలకు వచ్చే భక్తులకు అన్నపానీయాలకు లోటు లేకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు అందుబాటులో త్రాగునీరు, అన్నప్రసాద వితరణ కేంద్రాలను ఉంచింది.