గోవిందరాజు ఆలయంలో చోరీ : కిరీటాల దొంగ అరెస్టు

గోవిందరాజు ఆలయంలో చోరీ : కిరీటాల దొంగ అరెస్టు

తిరుపతి, వెలుగు: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉపాలయంలో రెండు నెలల క్రితం వజ్రాలు పొదిగిన మూడు కిరీటాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి పోలీసులు, టీటీడీ నిఘా విభాగం అధికా రులు ఏడు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి పోస్టర్లను విడుదల చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు మహారాష్ట్రలోని నాందేడ్‌‌కు చెందినవాడిగా గుర్తించారు.

నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నట్టు గుర్తించారు. అతడే చోరీ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. దాదర్ రైల్వేస్టే షన్ లో అరెస్టు చేశారు. అయితే కిరీటాలు మాత్రం దొరకలేదు. నిందితుడిని తిరుపతి తీసుకొచ్చి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నారు.