క్యూ4 ప్రాఫిట్​ రూ. 734 కోట్లు

క్యూ4  ప్రాఫిట్​ రూ. 734 కోట్లు

ముంబై: టైటాన్​ లిమిటెడ్​ మార్చి 2023 క్వార్టర్లో రూ. 734 కోట్ల నికర లాభం సంపాదించింది. అంతకు ముందు ఏడాది క్యూ 4 లోని రూ. 491 కోట్లతో పోలిస్తే ఈ నికర లాభం 50 శాతం ఎక్కువ. షేర్​ ఒక్కింటికి రూ. 10 చొప్పున డివిడెండ్​ చెల్లించాలని డైరెక్టర్ల బోర్డు రికమెండ్​ చేసింది. ఈ ఏడాది క్యూ 4 లో ఆపరేషన్స్​ రెవెన్యూ 33 శాతం అధికమై రూ. 9,704 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది మార్చి క్వార్టర్లో ఇది రూ. 7,276 కోట్లు మాత్రమే.

టైటాన్​ లిమిటెడ్​ ఇబిటా తాజా క్యూ4 లో 37 శాతం పెరిగి రూ. 1,053 కోట్లుగా రికార్డవగా, ఇబిటా మార్జిన్లు సైతం 12 శాతం వద్ద నిలిచాయి. జ్యెయెలరీ బిజినెస్​ రెవెన్యూ 24 శాతం పెరిగి రూ. 7,576 కోట్లకు, వెడ్డింగ్​ సెగ్మెంట్​ రెవెన్యూ రూ. 997 కోట్లకు, వాచెస్​ అండ్​ వేరబుల్స్​ రెవెన్యూ 40 శాతం ఎక్కువై రూ. 871 కోట్లకు చేరినట్లు టైటాన్​ లిమిటెడ్​ తెలిపింది. 10 లక్షలకు పైగా స్మార్ట్​ వాచీలను అమ్మినట్లు పేర్కొంది.

మార్కెట్​ షేర్​ పరంగా ఇండియాలోని టాప్ 5 స్మార్ట్​ వాచ్​ కంపెనీలలో ఒకటిగా టైటాన్​ అవతరించింది. మరోవైపు ఐ కేర్​ బిజినెస్​ 25 శాతం గ్రోత్​తో రూ. 165 కోట్లయినట్లు టైటాన్​ పేర్కొంది. యాన్యువల్​ కన్జూమర్​ రిటెయిల్​ సేల్స్​పరంగా కిందటేడాది చాలా మైల్​స్టోన్స్​ అందుకున్నామని టైటాన్​ వెల్లడించింది. అన్ని సెగ్మెంట్లలోనూ సంతృప్తికరమైన గ్రోత్​ సాధించామని ఎండీ వెంకటరామన్​ చెప్పారు. రిజల్ట్స్​ ప్రకటన నేపథ్యంలో టైటాన్​ షేర్లు  0.5 శాతం తగ్గి రూ. 2,651 వద్ద క్లోజయ్యాయి.