జగపతి బాబు లీడ్ రోల్‌లో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకుడు. చరితచిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై తమ్మారెడ్డి భరద్వాజ్, కిషోర్ నాయుడు చిరుమమిల్ల నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్‌తో ఆసక్తిరేపిన మేకర్స్.. తాజాగా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కార్తిక్ బి కొడకండ్ల కంపోజ్ చేసిన ఈ మెలోడియస్ సాంగ్‌ను ప్రియా నారాయణ పాడింది.
‘వదలా, వదలా నిన్ను వదలా.. ఏమైనా జరగనీ నిన్ను వదలా.. నా కన్నుల కటకటాలలో కట్టడి చేశా.. తప్పో ఒప్పో తప్పదుగా..’ అంటూ ఎర్రోజు శివకృష్ణాచారి లిరిక్స్ రాశారు. జగపతి బాబు, హృతికా శ్రీనివాస్ మధ్య ఎమోషన్‌ను క్యాప్చర్ చేసిన తీరు ఆకట్టుకుంది.
అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, జెన్నీ, రీను, కశ్యప్ రాజ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్. లక్ష్మీ భూపాల రైటర్ కాగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
