సర్పంచులు ఏం చేయాలో ఎమ్మెల్యేలే డిసైడ్ చేస్తున్రు : కోదండరాం

సర్పంచులు ఏం చేయాలో ఎమ్మెల్యేలే డిసైడ్ చేస్తున్రు : కోదండరాం

సర్పంచులు ఏం చేయాలో ఎమ్మెల్యేలే డిసైడ్ చేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్ లక్డికపూల్లో సర్పంచుల ఫోరం, పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ చట్టంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం.. ప్రజల మద్ధతుతో ఎన్నికల్లో గెలిచిన సర్పంచులపై ప్రభుత్వం పెత్తనం చెలాయించడం దుర్మార్గమని అన్నారు. కాంట్రాక్టుల ద్వారా వచ్చే కమీషన్ల కోసమే సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికారం లేకపోతే వారు ఉండలేరని.. దానికోసం ఎన్ని అక్రమాలైనా చేస్తారని మండిపడ్డారు. సర్పంచులు బలమైన శక్తులతో పోరాడుతున్నారని.. దానికి తగ్గట్లుగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కోదండరాం సూచించారు. అన్ని పార్టీలతో చర్చించి నెల రోజుల్లో బలమైన కార్యాచరణ సిద్ధం చేసుకుందామని భరోసానిచ్చారు.