సీఏఏపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

సీఏఏపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

సీఏఏకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో కొవిడ్ కేసులు తగ్గాక సీఏఏ అమలుచేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. బెంగాల్ సిలిగురిలో జరిగిన పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన  ఈ ప్రకటన చేశారు. సీఏఏ అమలు చేయడంలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. కానీ అది కార్యరూపం దాల్చుతుందని, తృణమూల్ దాన్ని అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, పార్శీలు, బౌద్ధులకు భారత పౌరసత్వం ఇవ్వడమే లక్ష్యంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించారు. 2014 డిసెంబర్ 31కన్నా ముందు వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామని చెప్పడంతో 2019, 2020లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.