బీజేపీ ఓటమి అనివార్యం : అభిషేక్‌‌‌‌ బెనర్జీ

బీజేపీ ఓటమి అనివార్యం : అభిషేక్‌‌‌‌ బెనర్జీ

కోల్‌‌‌‌కతా: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోక తప్పదని, దీనిని ఎవరూ తప్పించలేరని టీఎంసీ నేత అభిషేక్‌‌‌‌ బెనర్జీ పేర్కొన్నారు. బుధవారం ఆరాంబాగ్‌‌‌‌ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఒక్కసారి ప్రభుత్వం మారితే పలు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే రిలీజ్‌‌‌‌ అవుతాయని, వాటిని ప్రజల కోసం ఉపయోగిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు ద్వారా తగిన సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే టైమ్‌‌‌‌ వచ్చిందని అభిషేక్ చెప్పారు.