
డేటింగ్ యాప్ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ ఫోటోలు కలకలం సృష్టిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ కు చెందిన ఎంపీ, నటి నుస్రత్ జహాన్ ఫోటోలు డేటింగ్ యాప్ లో దర్శనమిచ్చాయి. దీంతో పశ్చిమ బెంగాల్ కు చెందిన నుస్రత్ తరుపు లాయర్ బసిరహాత్ కోల్ కత్తా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంపీ నుస్రత్ జహాన్ సైతం కోల్ కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా ఫ్యాన్సీ యూ – వీడియో చాట్ యాప్ సంస్థ తన ఫోటోల్ని సోషల్ మీడియా ప్రచారానికి వినియోగించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ సందర్భంగా సదరు సంస్థ వినియోగించిన ఫోటోల్ని ట్విట్టర్ లో పోలీసు కమిషనర్ అనుప్ శర్మను ట్యాగ్ చేశారు.దీనిపై సీపీ అనుప్ శర్మ మాట్లాడుతూ నుస్రత్ ఫోటోల్ని వినియోగించిన సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.