
కోల్ కతా : వెస్ట్ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 42 స్థానాలకు తమ పార్టీ క్యాండిడేట్లను సీఎం , టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఇందులో 40.5 శాతం సీట్లను మహిళలకు కేటాయించినట్టు ఆమె చెప్పారు. 17 ఎంపీ సీట్లను మహిళా అభ్యర్థులకు కేటాయించినట్టు చెప్పారు. మహిళా సాధికారిత దిశగా తాము తీసుకుంటున్న చర్యలకు ఇదో ఉదాహరణ అని ఆమె అన్నారు. అసన్ సోల్ సెగ్మెంట్ నుంచి బాలీవుడ్ సెలబ్రిటీ మూన్ మూన్ సేన్, బీర్బూమ్ నుంచి శతాబ్ది రాయ్ బరిలో దిగుతారని మమతా బెనర్జీ చెప్పారు.