ట్రంప్‌కు భారీ విజయం..బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం

ట్రంప్‌కు భారీ విజయం..బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక బిల్లు బిగ్ బ్యూటిఫుల్ కు కాంగ్రెస్ ఆమోదం లభించింది. ఇది ట్రంప్‌కు ఒక పెద్ద విజయం. గురువారం (జూన్3)   4.5 ట్రిలియన్ల డాలర్ల పన్ను ,వ్యయ బిల్లు  బిగ్ బ్యూటిఫుల్ కు  అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. 

అంతకుముందు సెనేట్‌లో కూడా ఆమోదం పొందింది. ఇకపై అధ్యక్షుడి సంతకం చేయడమే మిగిలింది. ఈ బిల్లుపై శుక్రవారం (జూలై 4, 2025న) సంతకం చేయనున్నారు.ఇది చట్టంగా మారనుంది.

ఓటింగ్ వివరాలు: ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. సెనేట్‌లో 51-50 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నిర్ణయాత్మక ఓటు వేశారు.

ఈ బిల్లు చట్టం అయితే ట్రంప్ 2017లో ప్రవేశపెట్టిన పన్ను కోతలను శాశ్వతం కానున్నాయి.  వలసలను అరికట్టడం కోసం నిధులు కేటాయించడం..ఆరోగ్య సంరక్షణ ,ఆహార భద్రతా కార్యక్రమాలలో కోతలు వంటివి ఈ బిల్లులో ప్రధానాంశాలు. ఈ బిల్లు చట్టం అయితే దేశ భద్రతకోసం భారీ ఎత్తున నిధులు కేటాయించనున్నారు.  

అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దేశ రుణ భారాన్ని పెంచుతుందని, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లేని వారి సంఖ్యను పెంచుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ వంటి దేశాలపై రెమిటెన్స్ ట్యాక్స్ ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టం కావడం ట్రంప్ రెండవ పదవీకాలంలో విధానపరమైన కీలక విజయం అని చెప్పవచ్చు.