పెద్దాపూర్‌‌‌‌‌‌‌‌ గురుకులంలో మళ్లీ కలకలం..ఎనిమిదో తరగతి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు అస్వస్థత

పెద్దాపూర్‌‌‌‌‌‌‌‌ గురుకులంలో మళ్లీ కలకలం..ఎనిమిదో తరగతి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు అస్వస్థత
  • కాలిపై రెండు గాట్లు, రక్తస్రావం, 
  • దురద, కడుపునొప్పితో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చేరిన విద్యార్థి
  • గతంలో పాము కాటుతో ఇద్దరు మృతి, మరో ముగ్గురికి అస్వస్థత

జగిత్యాల/కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలోని పెద్దాపూర్‌‌‌‌‌‌‌‌ గురుకుల స్కూల్‌‌‌‌‌‌‌‌లో మరోసారి కలకలం మొదలైంది. గతంలో పాముకాటుతో ఇద్దరు స్టూడెంట్లు చనిపోగా, మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. తాజాగా... బుధవారం రాత్రి ఓ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ అస్వస్థతకు గురయ్యాడు. ఇతడి కాలుపై రెండు గాట్లు ఉండడంతో పాటు రక్తస్రావం కావడం, దురద, కడుపునొప్పితో ఇబ్బంది పడుతుండడంతో గురుకులం నిర్వాహకులు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చేర్పించారు. గతంలో మాదిరిగానే మరోసారి అలాంటి ఘటన జరగడంతో ఇటు స్టూడెంట్లు, అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పాము కరిచిందా ? విషపురుగా ?

కోరుట్ల పట్టణానికి చెందిన వేముల నవనీత్‌‌‌‌‌‌‌‌ పెద్దాపూర్‌‌‌‌‌‌‌‌ గురుకులంలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి బయటకు వెళ్లాడు. ఈ టైంలో కాలిపై ఏదో కుట్టినట్లు అనిపించి చూడగా.. రెండు గాట్లు ఉండడంతో పాటు రక్తస్రావం జరిగింది. వెంటనే దురద, కడుపు నొప్పి రావడంతో విషయాన్ని గురుకుల సిబ్బందికి చెప్పాడు. వారు నవనీత్‌‌‌‌‌‌‌‌ను కోరుట్లలోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు అన్ని టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేస్తున్నామని, నవనీత్‌‌‌‌‌‌‌‌ను పాము కరిచిందా ? లేక ఇతర కారణమా ? అనేది తేల్చాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి నవనీత్‌‌‌‌‌‌‌‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్‌‌‌‌‌‌‌‌ వేముల రవికిరణ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.