
పద్మారావునగర్/ హైదరాబాద్ సిటీ వెలుగు : సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో టీఎంఆర్ఈఐఎస్ వార్షిక క్రీడా ప్రణాళిక 2025–26ను ఆ శాఖ సెక్రటరీ షఫీ ఉల్లా, అధ్యక్షుడు మహ్మద్ ఫహీముల్లా ఖురేషితో కలిసి కలెక్టర్ హరిచందన మంగళవారం ప్రారంభించారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కలిగిన 95 మంది అథ్లెట్లను సత్కరించారు.
ఈ సందర్భంగా ఫుట్‌బాల్, రెజ్లింగ్, బాక్సింగ్ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మార్చ్ పాస్ట్ పరేడ్ ఆకట్టుకున్నాయి.