అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటా : యెన్నం శ్రీనివాస్​రెడ్డి

అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటా : యెన్నం శ్రీనివాస్​రెడ్డి

పాలమూరు, వెలుగు: నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్​ రెడ్డి (వైఎస్ఆర్) హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం టీఎమ్మార్పీఎస్​ నాయకులు కాంగ్రెస్​ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా క్రిస్టియన్  మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బండా సునీల్ కుమార్  ఆధ్వర్యంలో జీపీ పాల్, సుజయ్ కుమార్, ప్రశాంత్,  భూషణం, జైపాల్, రాజు కాంగ్రెస్​లో చేరారు.

అలాగే బీఆర్ఎస్  పట్టణ మాజీ యూత్  వైస్  ప్రెసిడెంట్  రఘు, ఆ పార్టీ కార్యకర్తలు రఘు, సంతోష్, క్రాంతి ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్ గౌడ్  ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. హన్వాడ మండలానికి చెందిన టీఏసీఏ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ఎండీ మైనోద్దీన్, తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ జహంగీర్, ఎండీ అబ్దుల్​ తదితరులు మారేనల్లి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్​ కండువాలు కప్పుకున్నారు. వీరిని వైఎస్ఆర్​ పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం గ్రామీణ వైద్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యెన్నం మాట్లాడుతూ ఎస్సీలకు చెందిన అసైన్డ్  భూములను బీఆర్ఎస్​ సర్కారు గుంజుకుందని, ఆ భూముల్లో రైతు వేదికలు, శ్మశానవాటికలు కట్టారన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఎస్సీల సమస్యను పరిష్కరిస్తామన్నారు. గ్రామీణ వైద్యులకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు రూపొందించి, పల్లెల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, లీడర్లు సీజే బెనహర్​ పాల్గొన్నారు.