ఉద్యోగుల సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగుల సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగుల సమస్యలపై మ్యానిఫెస్టోలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలంగాణ ఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ కొనియాడారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ ఏరియర్స్ చెల్లింపు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపినట్లు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో తమతో సమావేశమై సమస్యలపై చర్చిస్తానని ముఖ్యమంత్రి హామీని ఇచ్చినట్లు తెలిపారు. 

ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకే, బ్యాలెట్ ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగులు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా..  నాంపల్లిలోని టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ఆయన ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి, బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని... త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ అన్నారు.