హైదరాబాద్,వెలుగు : తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, జలమండలి డైరీ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. ఖైరతాబాద్ లోని హెడ్డాఫీసులో టీఎన్జీవో అధ్యక్షుడు మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి టీజీవో హైదరాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరై డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. టీఎన్జీవో, జలమండలి కలిసి తొలిసారిగా డైరీ తయారు చేయడం ఆనందంగా ఉందన్నారు.
కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలు నిర్ధేశించుకుని ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో టీజీవో జలమండలి జనరల్ సెక్రటరీ చంద్రజ్యోతి, వాటర్ బోర్డు ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, జనరల్ సెక్రటరీ హరిశంకర్, టీఎన్జీవో జనరల్ సెక్రటరీ అజయ్ సింగ్, ట్రెజరర్ నవీన్, ప్రతినిధి భరత్ పాల్గొన్నారు.
