SBI బీఎంల చేతివాటం.. రూ.16 కోట్లు కొట్టేశారు

SBI బీఎంల చేతివాటం.. రూ.16 కోట్లు కొట్టేశారు
  • ప్రైవేట్ సంస్థతో కుమ్మక్కు
  • ఫేక్​ డాక్యుమెంట్లతో కోట్లు నొక్కేశారు

హైదరాబాద్​, వెలుగు: తిన్నింటి వాసాలనే లెక్కబెట్టారు బ్యాంకు మేనేజర్లు. పనిచేస్తున్న ఆఫీసులోనే కోట్ల రూపాయలు దారి మళ్లించారు. ఓ ప్రైవేట్​ సంస్థతో కుమ్మక్కై నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి రూ.16 కోట్లు కొట్టేశారు. ఈ ఘటన హైదరాబాద్​ మహబూబ్​గంజ్​ స్టేట్​బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్​లో జరిగింది. దానికి సంబంధించి శుక్రవారం ఆ బ్రాంచ్​ మేనేజర్ల ఇళ్లలో సీబీఐ తనిఖీలు చేసింది. హైదరాబాద్​, బెంగళూరు, మైసూరుల్లోని ఆరు ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.16 కోట్లకు సంబంధించిన లోన్​లో అవకతవకలున్నట్టు రీజనల్​ బిజినెస్​ మేనేజర్​ పి. రవికిరణ్​ గుర్తించారు. రీన్​ లైఫ్​ ల్యాబ్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ పేరుతో ఆ సంస్థ డైరెక్టర్​ అరుల్​ ప్రకాశ్, మహ్మద్​ అబ్దుల్​ అజీజ్​ బ్యాంక్​ లోను తీసుకున్నట్టు ఆయన రికార్డుల్లో గుర్తించారు. వాళ్లతో కలిసి లోన్​ అప్రూవల్​కు బీఎం శశిశంకర్​, చీఫ్​ మేనేజర్​ నాగేశ్వర్​ శర్మ, ఆర్‌ఎం పవన్​కుమార్‌లు కుట్ర పన్నారని గత ఏడాది డిసెంబర్​ 31న సీబీఐకి ఫిర్యాదు చేశారు. చనిపోయిన రీన్​ సంస్థ డైరెక్టర్​ విజయ రాఘవేంద్ర తండ్రి పేరిట నకిలీ డాక్యుమెంట్లు తయారు చే శారన్నారు. సంస్థ ప్రతినిధులతో కలిసి రూ.16 కోట్లను మేనేజర్లు దారి మళ్లించా రని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీబీఐ శుక్రవారం హైదరాబాద్​లోని మహ బూబ్​గంజ్ బ్రాంచ్​, మేనేజర్ల ఇళ్లు, బెంగళూరు, మైసూరులోని రీన్​ లైఫ్​ ల్యాబ్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ ఆఫీసుల్లో సోదాలు చేసింది.