సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వైస్ ​చాన్స్​లర్​

సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వైస్ ​చాన్స్​లర్​

డిచ్​పల్లి, వెలుగు: సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ  యూనివర్సిటీలో స్టూడెంట్స్​ధర్నాకు దిగారు. మంగళవారం ఆందోళన చేయగా, బుధవారం కూడా తరగతులు బహిష్కరించి టీయూ మెయిన్ ​గేట్​ఎదుట బైఠాయించారు. వీరికి మద్దతుగా బీజేపీ లీడర్లు నిరసనలో పాల్గొన్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో మధ్యాహ్నం వర్సిటీలోని వీసీ గెస్ట్​హౌజ్​ను ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకున్నా వినలేదు. సమస్యలపై వైస్​చాన్స్​లర్​ రవీందర్​ను నిలదీయగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

పది రోజుల్లో అంబులెన్స్​కొంటాం

పది రోజుల్లో అంబులెన్స్​ కొంటామని, హెల్త్​ సెంటర్​లో మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా చూస్తామని వీసీ రవీందర్​ హామీ ఇచ్చారు. వైఫై కోసం రూటర్లు కొన్నామని, త్వరలో వైఫై ఇన్​స్టాల్​ చేయిస్తామన్నారు. స్పోర్ట్స్​బోర్డు ఏర్పాటు చేశామని, ప్లే గ్రౌండ్​ని క్లీన్​ చేయిస్తున్నామని, స్పోర్ట్స్​ఎక్విప్​మెంట్​ కోసం రూ.25 లక్షలు కేటాయిస్తామన్నారు. మెస్​ లలో అదనపు టేబుల్స్, కుర్చీలు సమకూరుస్తామన్నారు. హాస్టల్స్​లో మూడు జిరాక్స్ ​మెషీన్లు ఏర్పాటు చేస్తామని, గర్ల్స్​హాస్టల్​పై అదనంగా మరో ఫ్లోర్​ నిర్మిస్తామన్నారు. కొత్తగా ఆడిటోరియం, గర్ల్స్ ​హాస్టల్ ​నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని, ఆర్​అండ్​బీ మినిస్టర్​ ప్రశాంత్​ రెడ్డిని కలిసి బిల్డింగ్స్​నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. వర్సిటీ లో కొత్త కోర్సులు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. దీంతో స్టూడెంట్స్​ హాస్టల్స్​కు వెళ్లిపోయారు.