బైక్ ఇంజిన్ లైఫ్ పెరగాలంటే.. క్లచ్, బ్రేక్లలో ముందుగా ఏది నొక్కాలో తెలుసా

బైక్ ఇంజిన్ లైఫ్ పెరగాలంటే.. క్లచ్, బ్రేక్లలో ముందుగా ఏది నొక్కాలో తెలుసా

బైక్ నడిపేటప్పుడు  బ్రేకులు ఎలా వేయాలో చాలా మందికి సరైన అవగాహన ఉండదు. బైక్ రైడర్లు తరచుగా క్లచ్, బ్రేక్ నొక్కడంలో తప్పులు చేస్తుంటారు. క్లచ్ , బ్రేక్ వాడకం బైక్ వేగాన్ని బట్టి మారుతుంది. ఏ పరిస్థితుల్లో క్లచ్ , బ్రేక్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. 

భారత్లో అత్యధిక శాతం మంది ప్రజలు తమ అవసరాలకోసం మోటార్ సైకిళ్లను ఉపయోగిస్తారు. దాదాపు ప్రతి ఒక్కరూ మోటార్ సైకిల్ను నడుపుతారు. అయితే క్లచ్, బ్రేక్ లేదా గేర్ ను ఎలా సరియైన పద్దతిలో ఉపయోగించాలో అందరికీ తెలియదు. వీటికి సంబంధించిన కొన్ని విషయాల గురించి సరైన సమాచారం లేని కారణంగా వారు తరుచుగా తప్పులు చేసి ప్రమాదాల బారిన పడుతుంటారు. 

బైక్ను ఆపడానికి బ్రేక్ లను ఎలా అప్లయ్ చేయాలి, క్లచ్ ను ఎప్పుడు నొక్కాలి లేదా బ్రేక్ లు, క్లచ్ లలో ఏది ముందుగా నొక్కాలి .. చాలా మంది ఇలాంటి వాటిని పట్టించుకోకుండా తప్పులు చేస్తుంటారు. అందుకే బైక్ బ్రేకులు, క్లచ్ లను ఏ సందర్భాలలో ఎలా ఉపయోగించాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

బ్రేకింగ్ అత్యవసర పరిస్థితి .. 

బ్రేకింగ్ అత్యవసర పరిస్థితి అంటే క్లచ్, బ్రేక్ రెండింటినీ ఏకకాలంలో నొక్కవచ్చు. క్లచ్ బ్రేక్ సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో కలిసి ఉపయోగించబడతాయి. ఎందుకంటే బైక్ మెకానికల్ భాగాలకు హాని కలిగించకుండా బ్రేకులను అప్లయ్ చేయడానికి ఇది అత్యంత ఉత్తమమైన మార్గం. అయితే బ్రేకులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

బైక్ అధిక వేగంగా ఉంటే..  

బైక్ అధిక వేగంతో ఉంటే ముందుగా బ్రేక్ నొక్కడం మంచింది. అప్పుడు మీరు బైక్ ను ఆపాలని లేదా బైక్ వేగం ప్రస్తుత గేర్ లో అత్యల్ప స్థాయికి చేరుకుందని అనిపిస్తే, క్లచ్ ను నొక్కి చిన్న గేర్ కి మారాలి. ఇలా చేయకుంటే బైక్ ఆగిపోతుంది. 

బైక్ సాధారణ వేగంతో ఉన్నప్పుడు .. 

బైక్ ను సాధారణ వేగంతో నడుపుతున్నట్లయితే బైక్ కు కొద్దిగా బ్రేకింగ్ అవసరమని మీరు భావిస్తే కేవలం బ్రేక్ ని నొక్కడం ట్రిక్ చేస్తుంది. దాని కోసం క్లచ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. బైక్ వేగాన్ని తగ్గించడానికి చిన్న అడ్డంకులను నివారంచడానికి మాత్రమే బ్రేకులను ఉపయోగించవచ్చు. 

తక్కువ వేగంతో ఉన్నపుడు ..

తక్కువ వేగంతో బైక్ ను నడిపిస్తున్నప్పుడు బ్రేక్ అప్లయ్ చేయాల్సి వస్తే.. ముందుకు క్లచ్ నొక్కి ఆపై బ్రేక్ ని నొక్కాలి. ఎందుకంటే ముందుగా బ్రేక్ నొక్కితే బండి ఆగిపోవచ్చు. మొదటి లేదా రెండవ గేర్ లో ప్రయాణించేటప్పుడు ఇది చేయాలి. అధిక వేగంతో ఉన్నపుడు ముందుగా బ్రేక్ లు వేయాలి. ఎందుకంటే ముందుగా క్లచ్ ని నొక్కి, తర్వాత బ్రేక్ ను నొక్కితే జారిపోయే ప్రమాదం ఉంది.