ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌, యూరప్​ దేశాలకు 13.6 బిలియన్లు సాయం

ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌, యూరప్​ దేశాలకు 13.6 బిలియన్లు సాయం

వాషింగ్టన్:ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌, యురోపియన్‌‌‌‌‌‌‌‌ మిత్రదేశాలకు అమెరికా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 13.6 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లు ఇచ్చేందుకు అమెరికా సెనేట్ సభ్యులు ఆమోదం తెలిపారు. 1.5 ట్రిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్​లో భాగంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో పాటు.. రష్యా చేతిలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ కు ఈ సాయం ప్రకటించింది అమెరికా. 1.5 ట్రిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లలో 13.6 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లు తక్కువే అయినప్పటికీ.. రష్యా మెరుపు దాడులను ఎదుర్కొనేందుకు ఈ సాయం ప్రకటించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. దీంతో పాటు యూరప్‌‌‌‌‌‌‌‌ శరణార్థుల కోసం కూడా నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.