ఫిఫా మ్యాచ్లను చూసేందుకు రూ. 23 లక్షలతో ఇళ్లు కొనుగోలు

ఫిఫా మ్యాచ్లను చూసేందుకు రూ. 23 లక్షలతో ఇళ్లు కొనుగోలు

ఫిఫా వరల్డ్ కప్ కేరళను ఊపేస్తోంది. దేవభూమి కేరళలో ఎక్కడ చూసినా ఫుట్ బాల్ ప్లేయర్ల కటౌట్లు,  ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. పలు దేశాల జెర్సీలు ధరించి..ఫుట్‌బాల్‌పై  ప్రేమను చాటుకుంటున్నారు. అయితే  కొచ్చి జిల్లా ముండక్కముగల్ గ్రామస్తులు ఫుట్‌బాల్‌పై తమకున్న ప్రేమను చాటుకునేందుకు మరో అడుగు ముందుకేశారు. ఫిఫా మ్యాచ్‌లను చూసేందుకు ఏకంగా రూ. 23 లక్షలతో ఇంటిని కొనుగోలు చేశారు. 

ఇంటిని కొనుగోలు చేసిన 17 మంది 
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచులను చూసేందుకు 17 మంది ఫ్యాన్స్  ఇంటిని  రూ. 23 లక్షలకు కొన్నారు. అంతేకాదు ఇంట్లో బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్ దేశాలను జెర్సీల బొమ్మలు వేయించారు. మెస్సీ, ​రొనాల్డోల బొమ్మలను గీయించారు. ఇంటి లోపల ఇతర ఫుట్‌బాల్ స్టార్ల కటౌట్లను ఏర్పాటు చేశారు.మ్యాచులను వీక్షించడానికి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. 

కటౌట్లే దర్శనం
కేరళలోలో ఎక్కడ చూసినా ఆటగాళ్ల కటౌట్లే దర్శనమిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వివిధ దేశాలకు చెందిన ప్లేయర్ల కటౌట్లను ఏర్పాటు చేశారు. పుల్లవూరులోని నదిలో మెస్సీ, రొనాల్డో, నెయ్ మార్ జూనియర్ కటౌట్లను పెట్టారు. ప్రస్తుతం ఈ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.