
హైదరాబాద్, వెలుగు: లాభాపేక్ష లేని విద్యా సంస్థల చెయిన్ టోస్ట్‌మాస్టర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 126 వార్షిక సదస్సు “జూబిలెన్స్” రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఈఎస్సీఐ కాలేజీలో జరిగింది. ఈ సదస్సు భాషా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై ఫోకస్ చేసింది.
టోస్ట్మాస్టర్స్కు చెందిన సాయినాథ్ గుప్తా మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ కు ఎంతో మంది గ్రామీణ యువత చదుకోవడానికి, జాబ్ కోసం వస్తూ ఉంటారు. అలాంటి వారికి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ నేర్పించడంలో టోస్ట్‌మాస్టర్స్ క్లబ్స్ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎవరైనా టోస్ట్‌మాస్టర్ క్లబ్‌లో చేరి ఉచితంగా స్కిల్స్నేర్చుకోవచ్చు”అని ఆయన వివరించారు.
తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 143 దేశాల్లో 17 వేలకుపైగా క్లబ్‌లతో విస్తరించి ఉందని టోస్ట్‌మాస్టర్స్ తెలిపింది.