రాష్ట్రంలో కొత్త‌గా 49 పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కొత్త‌గా 49 పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో బుధ‌వారం మ‌రో 49 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు హెల్త్ మినిష్ట‌ర్ ఈట‌ల రాజేంద‌ర్. బుధ‌వారం క‌రోనాపై ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఈట‌ల‌.. తాజా కేసుల‌తో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ ల సంఖ్య 453కి చేరింద‌న్నారు. ఇందులో 45 మంది డిశ్చార్జ్ అయ్యారు, 11 మంది మృతి చెందారు, మరో 397 మంది చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.  ఢిల్లీ నుంచి వ‌చ్చిన 1100 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని.. దీనితో మార్కజ్ నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు పూర్తి అయ్యారని తెలిపారు. వారితో కాంటాక్ట్ అయిన 3 వేల మందికి పైగా క్వారంటైన్ చేశామ‌న్నారు.

రాష్ట్రంలో మందుల కొర‌త లేద‌న్న మంత్రి..  80 వేల పిపిఈ కిట్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 5 లక్షలు ఆర్డర్ చేశామ‌ని..లక్ష ఎన్ 95 మాస్క్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. డాక్టర్ మాస్క్ లు 2 కోట్లు ఆర్డర్ చేశామ‌ని, 5 లక్షల కళ్ళకు పెట్టుకునే గాగుల్స్ కూడా ఆర్డర్ చేశామ‌న్నారు. 3.5 టెస్టింగ్ కీట్స్ ఆర్డర్ చేశామ‌ని గ‌చ్చి బౌలిలో 1500 బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 22 మెడికల్ కాలేజీల్లో 15 వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి నెగెటివ్ వచ్చిందని …గురువారం మరోసారి టెస్ట్ చేసి డిశ్చార్జ్ చేస్తామ‌న్నారు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్.