మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నిన్నటి(ఫిబ్రవరి 11) నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈరోజు(ఫిబ్రవరి 12) కూడాగోల్డ్ ధరలు తగ్గాయి. మాఘ మాసం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం బంగారం కొనే వారికి ఇదే మంచి అవకాశం. 

పెళ్లిళ్ల ప్రారంభం కావడంతో బంగారు షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా 2024 ఫిబ్రవరి 12వ తేదీని దేశంలో బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. అంటే తులం బంగారంపై పది రూపాయలు తగ్గింది. దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,940 ఉంది. 

బంగారం ధరల బాటలోనే సిల్వర్ రేట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి ప్రస్తుతం రూ. 74,900 వద్ద ఉంది. ఇక్కడ గత 10 రోజుల్లో రూ. 1600 తగ్గింది. హైదరాబాద్‌లో కూడా ఇలాగే రూ. 100 తగ్గి ప్రస్తుతం కిలో ధర రూ. 76,400 వద్ద ఉంది. ఇక గోల్డ్, సిల్వర్ ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లను బట్టి హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.

దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

హైదరాబాద్..
22 క్యారెట్ల బంగారం ధర -10 గ్రాములకు రూ. 57,690
24 క్యారెట్ల బంగారం ధర -10 గ్రాములకు రూ. 62, 940

ఢిల్లీ..
22 క్యారెట్ల బంగారం ధర -10 గ్రాములకు రూ. 58, 700
24 క్యారెట్ల బంగారం ధర -10 గ్రాములకు రూ. 61, 640

విజయవాడ..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940

ముంబయి...
22 క్యారెట్ల బంగారం ధర - 10 గ్రాములకు రూ.58,580
24 క్యారెట్ల బంగారం ధర - 10 గ్రాములకు రూ.61,510

చెన్నై..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,290
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,590