పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే.?

పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే.?

రెండు రోజుల కింద కాస్త తగ్గిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 15న 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగింది. పెట్టుబడిదారులు అనిశ్చిత సమయాల్లో సురక్షితమైన స్వర్గధామ ఆస్తిగా పరిగణించబడే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57వేల 750 రూపాయలు ఉండగా..  24 క్యారెట్ల బంగారం ధర రూ.63 వేలుగా ఉంది.

హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం  ధర  10 గ్రాములకు రూ. 100 పెరిగి  ప్రస్తుతం రూ. 57 వేల 750 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల  బంగారం  ధర తులానికి రూ. 110 పెరిగి  ప్రస్తుతం రూ. 63 వేల వద్ద ఉంది.   విజయవాడలో 22 క్యారెట్ల బంగారం  ధర  10 గ్రాములకు రూ.100 పెరిగి ప్రస్తుతం రూ. 57 వేల 750 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల  బంగారం  ధర తులానికి రూ. 110 పెరిగి   రూ. 63 వేలుగా ఉంది.

 ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం  ధర  10 గ్రాములకు రూ.100 పెరిగి ప్రస్తుతం రూ. 57 వేల 900 గా ఉంది. ఇక 24 క్యారెట్ల  బంగారం  ధర తులానికి రూ. 110 పెరిగి  ప్రస్తుతం రూ. 63 వేల150 గా ఉంది.