భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

బంగారం కొనుగోలు దారులకు పసిడి ధరలు షాకిచ్చాయి. రెండు రోజుల క్రితం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 2023, నవంబర్ 26వ తేదీ ఆదివారం మరోసారి పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 పెరగగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.320 పెరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం)  ధర రూ.57,100గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.62,290గా ఉంది. ఎపిలోని విశాఖపట్నం, విజయవాడలోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.80,200గా ఉంది.  దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,200గా ఉంది.

ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ.57,250గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,440గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ.57,250గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,440గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ.57,250,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,440కి చేరుకుంది.