ఇవాళ (జులై 01) ఇంగ్లండ్‌‌‌‌తో ఇండియా అమ్మాయిల రెండో టీ20.. రా. 11 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌‌‌లో

ఇవాళ (జులై 01) ఇంగ్లండ్‌‌‌‌తో ఇండియా అమ్మాయిల రెండో టీ20.. రా. 11 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌‌‌లో

బ్రిస్టల్‌‌‌‌: ఆరంభ పోరులో అద్భుత విజయం అందుకున్న ఇండియా అమ్మాయిలు ఇంగ్లండ్‌‌‌‌ గడ్డపై మరో విజయంపై గురి పెట్టారు. ఐదు టీ20ల సిరీస్‌‌‌‌లో భాగంగా మంగళవారం  (జులై 01) జరిగే రెండో  మ్యాచ్‌‌‌‌లో ఫుల్ కాన్ఫిడెన్స్‌‌‌‌తో బరిలోకి దిగుతున్నారు. తొలి పోరులో సెంచరీ కొట్టిన స్మృతి మంధాన సూపర్ ఫామ్‌‌‌‌లో ఉండగా.. గాయం నుంచి కోలుకొని కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ బరిలోకి దిగితే జట్టు బలం మరింత పెరగనుంది. 

టీ20ల్లో మంధాన తొలి సెంచరీతో మెరవడంతో పాటు అరంగేట్రంలో తెలుగమ్మాయి శ్రీచరణి నాలుగు వికెట్లు పడగొట్టడంతో గత పోరులో ఇండియా 97 రన్స్ తేడాతో భారీ విజయం అందుకుంది. పేసర్లు రేణుకా సింగ్ ఠాకూర్, పూజా వస్త్రాకర్ లేని లోటు కనిపించలేదు.  వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన హర్లీన్ డియోల్ కూడా ఆకట్టుకుంది.  అదే జోరును కొనసాగిస్తూ సిరీస్‌‌‌‌లో 2–0తో ఆధిక్యం అందుకోవాలని ఇండియా భావిస్తోంది. 

ఇంకోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ సివర్ బ్రంట్ (66) తప్ప మిగతా బ్యాటర్లు పూర్తిగా ఫెయిలయ్యారు. చరణి, దీప్తి శర్మ, రాధా యాదవ్‌‌‌‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. మరి, రెండో పోరులో ఏం చేస్తారో చూడాలి.