ఇవాళ (జూన్ 21) ‘సమ్మర్ సోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైస్’.. పగలు ఎక్కువ.. రాత్రి తక్కువ !

ఇవాళ (జూన్ 21) ‘సమ్మర్ సోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైస్’.. పగలు ఎక్కువ.. రాత్రి తక్కువ !

ఇయ్యాల (June 21) ‘సమ్మర్ సోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైస్’ (సుదీర్ఘ పగలు) కొనసాగనుంది.  సమ్మర్ సోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైస్ అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. లాటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోల్ అంటే సూర్యుడు, సిస్టెరే అంటే కదలకుండా ఉండటం. ఉత్తరార్ధ గోళం సూర్యుడికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో సమ్మర్ సోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైస్ ఏర్పడటం వలన ఆ రోజున ఉత్తరార్ధ గోళంలో పగటి కాలం ఎక్కువ సేపు ఉంటుంది. 

ఈ రోజు జూన్ 21వ తేదీన ఉత్తరార్ధ గోళంలోని కర్కాటక రేఖపై సూర్యుడు నిట్టనిలువుగా ఉంటాడు. దీనివల్ల 23.5 డిగ్రీల అక్షాంశాలకు పైనుండే ప్రాంతాల్లో అసలు రాత్రే ఉండదు. ఎందుకంటే ఈ ప్రాంతాలు సూర్యుడికి అత్యంత సమీప దూరంలోకి వస్తాయి. సమ్మర్ సోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైస్ ఎప్పుడూ జూన్ 20 నుంచి 22 మధ్య వస్తుంది. అదే లీప్ సంవత్సరం అయితే, జూన్ 20న వస్తుంది. 

ఈ సంవత్సరం జూన్ 21వ తేదీన వచ్చింది సూర్యుడు చుట్టూ భూమి తిరిగే సమయానికి మన కాలెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య స్వల్ప తేడా ఉంటుంది. ఈ తేడా వల్లే సమ్మర్ సోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైస్ తేదీ కూడా మారుతుంది. ఉత్తరార్ధ గోళంలో సమ్మర్ సోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైస్ వచ్చినప్పుడు, దక్షిణార్ధ గోళంలో వింటర్ సోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైస్ వస్తుంది. అంటే దక్షిణార్ధ గోళంలో చలికాలం మొదలవుతుంది. 

భూమి ఒక వైపుకి ఒరిగి తిరగడం వలన  ఈ రోజు నార్వే, ఫిన్లాండ్, గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్, అలస్కా సహా మరికొన్ని ధ్రువ ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా సూర్యుడు ప్రకాశిస్తాడు. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో సూర్యుడు అసలు అస్తమించడు. భూమి ఒక పక్కకు ఒరిగి, వంగి తిరిగేటప్పుడు, ఉత్తర లేదా దక్షిణ ధ్రువాలు సూర్యుడికి అత్యంత సమీపంలోకి వచ్చేటప్పుడు పగటి కాలాల్లో మార్పులు వచ్చి పగటి సమయం ఎక్కువగా ఉంటుంది.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డాక్టర్. వై. సంజీవ కుమార్