ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా

 ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా

మిడిల్‌ ఈస్ట్‌లోని ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక స్థాయికి చేరిన ముడి చమురు ధరలు, కాస్త తగ్గడం మొదలయ్యాయి. ప్రస్తుతం, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.29 డాలర్లు తగ్గి 78.32 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.23 డాలర్లు పెరిగి 83.44 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో చమురు ధరల మార్పుల మీద ఇవి ప్రభావం చూపడం లేదు. దేశంలోని ప్రధాన నగరాలు అయిన న్యూఢిల్లీలో ఈరోజు పెట్రోల్ ధర లీటరు రూ. 96.72 గాను, లీటరు డీజిల్ ధర రూ. 89.62 గాను, అలాగే ముంబై లో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ. 106.31 లుగాను, అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 94.27 లుగా నమోదు అవ్వడం జరిగింది, ఇక నిన్నటి ధరలతో పోల్చితే ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి వ్యత్యాసం లేదు.

తెలంగాణ లో 
 డీజిల్, పెట్రోల్ ధరల్లో మార్పు ఏం లేదు.  హైదరాబాద్ లో లీటర్‌ డీజిల్‌ రూ.97.82, పెట్రోల్ రూ.109.66 గా ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లో
 విషయానికి వస్తే, విజయవాడలో ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76 గాను, డీజిల్ ధర లీటర్ రూ. 99.51 గా ఉంది, నిన్నటి ధరతో పోల్చితే ఈ రోజు పెట్రోల్ ధర రూ. 0.26, అలాగే డీజిల్ ధర రూ. 0.24 పెరిగింది.