ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై తీర్పు నేడే

ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై తీర్పు నేడే

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విరాళాల సేకరణకోసం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. అది ప్రభుత్వ విధాన నిర్ణయమని, తప్పులు వెతకాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లు బాటును సవాలు చేస్తూ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వేసిన పిల్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణు గోపాల్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ను సమర్థించారు. “లోక్ సభఎన్నికలకు ఖర్చు చేసే నిధుల్లో 43.8 శాతం నల్లధనమేనని రిపోర్టులు చెబుతున్నాయి. దీన్ని నివారించేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఇది ప్రభుత్వపాలసీ డెసిషన్‌. తప్పుబట్టడానికి వీల్లేదు. ఎన్నికలకు ప్రభుత్వమే ఖర్చు చేసే పాలసీ మన దగ్గర లేదు. మద్దతుదారులు, ధనవంతులు, కంపెనీల నుంచి నిధులుసేకరించాల్సి ఉంటుంది. వాళ్ల పార్టీయే గెలవాలని వాళ్లు కోరుకుంటారు. వాళ్ల పార్టీ గెలవకపోతే కొన్నిపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకేగోప్యత అవసరం” అని వాదించారు.

రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలన్నీ వైట్ మనీ అని, ప్రభుత్వసంస్థలు బ్యాంకింగ్ చానెల్ ద్వారా వాటిని చెక్ చేయవచ్చన్నారు . అయితే అటార్నీ జనరల్ వాదననుఈసీ తరఫున హాజరైన సీనియర్ లాయర్ రాకేశ్ద్వి వేది వ్యతిరేకిం చారు. గోప్యతకు అనుమతిస్తేదాన్ని చట్టబద్ధం చేసినట్లేనని అన్నారు . “గోప్యతపోవాలి. పారదర్శకత రావాలి. మేం సంస్కరణలుకోరుకుంటున్నాం . ఒక అడుగు ముందుకు, మరోరెండడుగులు వెనక్కి వేయబోం. న్యాయమైన, స్వచ్ఛమైన ఎన్నికలను కోరుకుంటున్నాం ” అని ఆయనవాదనలు వినిపించారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కుఈసీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. క్యాం డిడేట్లు ,వారికి నిధులు సమకూర్చే పార్టీల పూర్తి వివరాలుఓటర్లకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు .ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ లో లోపాలు ఉన్నాయని ,స్వేచ్ఛా యుతమైన, పారదర్శకమైన ఎన్నికల ప్రక్రి-యకు ఇది వ్యతిరేక చర్య అని పిటిషనర్ల తరఫునలాయర్ ప్రశాంత్ భూషణ్ వాదిం చారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై స్టే విధించాలి లేదా దాతల వివరాలు బయటపెట్టాలని కోరారు. దీనిపై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.